తాజా వార్తలు

కాలం చెల్లిన మందులకు యువతి బలి

సిరా న్యూస్,వికారాబాద్; వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మెడికల్ షాపు యజమాని, ఆర్ఎంపి డాక్టర్ నిర్వాకంతో లక్ష్మీ (18) అనే యువతి మృతి చెందింది. కాలం చెల్లిన టాబ్లెట్ వేసుకోవడం వల్ల రియాక్షన్ జరిగియువతి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. స్వల్ప జ్వరంతో దోమ మండల కేంద్రంలో ఉన్న శివరాం అనే ఆర్ఎంపి డాక్టర్ ను యువతి కుటుంబ సభ్యులు సంప్రదించారు. ఎమ్మారెస్ మెడికల్ షాపులోమందులు ఆర్ఎంపి సూచించాడు. కాలం చెల్లిన మందులు మెడికల్ షాప్ యజమాని ఇచ్చాడు. ఉదయం టాబ్లెట్ వేసుకున్న యువతి వెంటనే అస్వస్థత కు గురయింది. యువతిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికితీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. మెడికల్ షాప్ యజమాని, ఆరెంపి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని దోమ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు.…

Read More
19 Jan 2024, 3:37 pmsiranews.in