ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ఆధార్ ప్రామాణికంగా సేవలు

సిరా న్యూస్,తిరుమల; తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని వివరించారు. ఫలితంగా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని చెప్పారు. అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ….శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని ప్రకటించారు.⁠గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నట్లు…

Read More
9 Sep 2024, 11:49 amsiranews.in