Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 11 May 2024, 3:37 pmEditor : Sira News

అమ్మాయిల ఫోటోలను న్యూడ్ మార్చే నిందితుడు అరెస్టు

 సిరా న్యూస్,మేడ్చల్;
అమ్మాయిల ఫోటోలను సేకరించి న్యూడ్ చిత్రాలుగా మార్చి ఇంస్ట్రాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహమ్మద్ అర్షద్ అనే వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇద్దరమ్మాయిల ఫోటోలు మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మేడిపల్లి పిఎస్ లో బాధితుల ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మహ్మద్ అర్షద్ ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. న్యూడ్ వీడియోలు మార్పిడి చేసి బాధితులకు పంపి లవ్ చేయాలని మానసికంగా వేధించేవాడు. నిందితుడు మహమ్మద్ అర్షద్ ని రిమాండ్ కు తరలించారు…
===

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.