
విజయసాయిరెడ్డిపై చర్యలా….
సిరా న్యూస్,నెల్లూరు; వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి నేత దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు వేసింది వైసీపీ అధిష్టానం. దీనికి ఫ్యామిలీ వ్యవహారాలే కారణమని, అందువల్లే ఆయనను పక్కన పెట్టాల్సివచ్చిందని ఫ్యాన్ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇలాంటి చిక్కు సమస్యను వైసీపీ ద్వితీయ నేత విజయసాయిరెడ్డి ఎదుర్కొంటున్నారు.వీఎస్ఆర్ వ్యవహారంపై దాదాపు వారంరోజుల పాటు వార్తలు నానాహంగామా చేశాయి. అయితే వీఎస్ఆర్ విషయంలో జగన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ఆ పార్టీ నేతలు ఆరా తీయడం మొదలు పెట్టారు. కొన్ని విషయాలు అంతర్గతంగా చర్చించుకోవడం మొదలైంది.దేవాదాయశాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ కమిషన్ వ్యవహారంలో విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి గురించి వేగుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారట జగన్. ఈ వ్యవహారం పై పార్టీకి ఇంటా బయటా అనేక తలనొప్పులు తెచ్చాయి. కాసింత పార్టీ డ్యామేజ్ కూడా…
