
పార్టీలో మార్పుల దిశగా చర్యలు
సిరా న్యూస్,విజయవాడ; వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. యాక్టివ్ గా లేని నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఒకరిద్దరు గొంతు మినహా మిగిలిన వారంతా మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అయినట్లు వ్యవహరించిన నేతలు కూడా ఓటమి చెందిన వెంటనే ఇలా నీరుగారి పోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయని గ్రహించారు. అందుకే ముందు జిల్లాల వారీగా నాయకత్వాలను మార్చాలని వైఎస్ జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన తెప్పించుకుని కసరత్తు చేస్తున్నారు. కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగిస్తే జిల్లా స్థాయిలో పార్టీ…
