తాజా వార్తలు

జనసేన పార్టీ క్రియాశీలక ఆత్మీయ సమావేశం….

సిరా న్యూస్,నందికొట్కూరు ; ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన టిడిపి సమన్వయ కమిటీ అధ్యక్షులు శ్రీ చింతా సురేష్ బాబు గారి ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం, నందికొట్కూరు మండలంలో సోమవారం కొణిదెల గ్రామంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన- తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ బాధ్యుడు శ్రీ నల్లమల రవికుమార్  తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు రూరల్ కన్వీనర్ ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నల్లమల రవికుమార్  మాట్లాడుతూ వైసీపీ నాయకుల వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం జరిగిందని, నిరుద్యోగులను నిరాశ పరిచారని, రైతులకు తీరని అన్యాయం చేశారని తెలియజేయడం జరిగింది. కనుక 2024లో వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు అర్థం చేసుకొని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరడం జరిగింది. జనసేన తెలుగుదేశం…

Read More
5 Dec 2023, 7:34 pmsiranews.in