
Addi Bhoja Reddy: అమరవీరుల త్యాగాలు మరవలేనివి: డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి
సిరాన్యూస్,ఆదిలాబాద్ అమరవీరుల త్యాగాలు మరవలేనివి: డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి * కార్గిల్ అమర వీరులకు కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళ్లు * కార్గిల్ పార్క్ లోని స్థూపం వద్ద పుష్పాంజలి అమరవీరుల త్యాగాలు మరవలేనివని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కార్గిల్ పార్క్ లో స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళ్లు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి త్యాగాలు వెల కట్టలేనివంటూ స్మరించుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం హాయిగా ఉన్నామంటే వారి త్యాగాల పుణ్య ఫలమే అన్నారు. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు.పాక్ దుశ్చర్య కారణంగా కార్గిల్ యుద్దం జరిగిందని మన సైనికులు దాన్ని తిప్పికొట్టి కార్గిల్ లో విజయం సాధించినా ఆ…
