
Adilabad Voters Crowned Payal Shanakar: పాయల్‌కు పట్టం కట్టిన ఆదిలాబాద్ ఓటర్లు…
సిరా న్యూస్, ఆదిలాబాద్: పాయల్‌కు పట్టం కట్టిన ఆదిలాబాద్ ఓటర్లు... + 15 ఏండ్ల పోరాటానికి దక్కిన ప్రతిఫలం + వినయం, విధేయత, నిబద్ధతకు ఓటేసిన ప్రజానికం + కౌంటింగ్ తరువాత కన్నీటి పర్యాంతమైన పాయల్ శంకర్ + కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు + ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ పట్టువదలని విక్రమార్కుడిలా 15 ఏండ్లు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేసిన పాయల్ శంకర్‌కు ఈ సారి ఆదిలాబాద్ ఓటర్లు పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, పాయల్ శంకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించారు. గత 15 ఏండ్లుగా నిర్విరామంగా ప్రజల్లో ఉంటూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఆయన ధీరత్వానికి స్వయంగా ఎమ్మెల్యే పదవే నీ గులామునంటూ సలాము చేసింది. 67608 ఓట్లు సాధించిన ఆయన…
