
ఆదిమూలం, వరలక్ష్మీ… రాజీ పడ్డారా…
సిరా న్యూస్,తిరుపతి; అవును, వాళ్లిద్దరూ రాజీ పడ్డారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేస్ క్లోజ్ అయింది. ఫిర్యాది దారే ఆయన తప్పు లేదని చెప్పారు కాబట్టి, ఇక ఆయనపై ఆరోపణలు లేనట్టే. మరి పార్టీ నుంచి బహిష్కరణ వ్యవహారంలో అప్ డేట్ ఏంటో తేలాల్సి ఉంది. కేసు లేదు కాబట్టి తిరిగి ఆయన పార్టీలో యాక్టివ్ అవుతారా, లేక తప్పు చేసి రాజీ పడ్డారు కాబట్టి కొన్నాళ్లు పార్టీకి దూరంగానే ఉండాల్సి వస్తుందా..? వేచి చూడాలి. ఇప్పటికిప్పుడు పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తుందని అనుకోలేం. ఆ వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది కాబట్టి.. మరోవైపు వైసీపీ నేతలను ఇదే విషయంలో టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది కాబట్టి మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం పూర్తిగా సద్దుమణిగే వరకు ఆదిమూలం కూడా…
