సిరాన్యూస్, ఓదెల
ఆదివరాహ స్వామి సన్నిధిలో తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేక పూజలు
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కమాన్ పూర్ మండల పరిదిలో గల ఆదివరాహ స్వామి సన్నిధిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక పుజలు నిర్వహించారు.ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం , రాష్ట్ర కార్యదర్శి కదార కళాధర్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన 250 గజాల స్థలం వెంటనే ఇవ్వాలని ఆది వరహా స్వామి వేడుకున్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , ఉద్యమకారులకు 250 గజాల స్థలము అమరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ హెల్త్ కార్డు ఉచిత బస్ రైలు పాస్ తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులను గుర్తించి సముచిత స్థానం కల్పించాలని , ఉద్యమకారులకు 250 స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు ఇవ్వాలని జార్ఖండ్ రాష్ట్రంలో ఇచ్చిన విధంగా ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన అవకాశాలు కల్పించాలని ఆదివరాహ స్వామి సన్నిధిలో ముక్కులు చెల్లించారు.ఈ మధ్య కాలంలో జార్ఖండ్ రాష్ట్రానికి ఎన్నికల ఇన్చార్జి గావెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అక్కడి ప్రభుత్వం ఉద్యమకారుల కల్పించిన పథకాలను తెలుసుకొని అంతకంటే మెరుగైన అవకాశాలు తెలంగాణ ఉద్యమకారులకు కల్పిస్తారని నమ్మకంతో ఆదివరాహస్వామి సాన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం , రాష్ట్ర కార్యదర్శి కదార కళాధర్ రెడ్డి , పిడుగు భీమలింగం , రాహుల్ , పిట్టల బాలకృష్ణ ,గోగుల శ్రీనివాస్ , కాసు రాజయ్య , అనిల్ , పిట్టల సదయ్య , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.