
Adv. Sangem Sudheer Kumar: న్యాయ కోవిదుడు… రియల్ శ్రీమంతుడు…
సిరా న్యూస్, ఆదిలాబాద్: న్యాయ కోవిదుడు... రియల్ శ్రీమంతుడు... + సంగెం చారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు + ఆదర్శంగా నిలుస్తున్న న్యాయవాది "సంగెం సుధీర్ కుమార్" ‘సంగెం సుధీర్ కుమార్’ న్యాయవాదిగా ఆదిలాబాద్ వాసులకు చాల సుపరిచిమైన పేరు. ప్రస్తుతం ఆయన తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే.. నిరుపేదల కోసం నేనున్నాను అంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ–కే అనే మారుమూల గ్రామానికి చెందిన సంగెం గంగారాం, గిర్మాబాయి దంపతులకు జన్మించిన ఆయన తన స్వంత ఊరితో పాటు ఇతర గ్రామాల్లో సైతం సేవా కార్యక్రమాలు చేపడుతూ తన ఔనత్యాన్ని చాటుతున్నారు. గత 10ఏళ్లుగా తన తల్లి జ్ఞాపకార్థం సంగెం చారిటబుల్ ట్రస్ట్‌తో ఆపన్నులకు అండగా నిలుస్తూ, ప్రజల మన్నలను పొందుతున్నారు. 2014లో అప్పటి…
