తాజా వార్తలు

Afrina Begum: రాజీనామాను ఉప‌సంహ‌రించుకున్న 6 వార్డు కౌన్సిలర్ ఆఫ్రినా బేగం

సిరాన్యూస్‌, ఖానాపూర్ రాజీనామాను ఉప‌సంహ‌రించుకున్న 6 వార్డు కౌన్సిలర్ ఆఫ్రినా బేగం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 6 వార్డు కౌన్సిలర్ ఆఫ్రినా బేగం త‌న రాజీనామా లేఖ‌ను ఉపాసంహరించుకుంటున్నానని, దానిని ఆమోదించకుండా ఆపాలని శుక్ర‌వారం విన్న‌పం చేసుకున్నారు. ఈనెల 21న కొన్ని అనివార్య కారణాల వలన తాను మనస్థాపానికి గురై నా యొక్క కౌన్సిలర్ పదవీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను క‌మిష‌న‌ర్‌కు సమర్పించాన‌ని, దీనిని ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దానిని ఆమోదించకుండా ఆపి మున్సిపల్ కౌన్సిలర్ గా కొనసాగించాలని కోరార‌ని, అలాగే మిగితా కౌన్సిలర్ సభ్యులు జోక్యం చేసుకొని చిన్న చిన్న తప్పిదాలకు రాజీనామా పరిష్కారం కాదని, ఏదైనా సమస్య ఉంటే అందరం కలిసి పరిష్కరిద్దామని చెప్పాడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. కౌన్సిలర్ సభ్యులందరం కుటుంబ సభ్యులుగా కలిసి మున్సిపాలిటీ…

Read More
25 May 2024, 2:55 pmsiranews.in