తాజా వార్తలు

హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఎదురీత

సిరా న్యూస్,ఛండీఘడ్; హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 18 రోజులే గడువు ఉంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం ఈ 18 రోజులు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. అధికార బీజేపీ మరోమారు గెలవాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల జోషల్‌తో కాంగ్రెస్‌ గెలుపు తమదే అంటోంది. ఇక ప్రాంతీయ పార్టీలు కూడా గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఈసారి ఆప్‌ కూడా అధికారంలోకి వస్తామంటోంది. ఈ క్రమంలో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయం అంత ఈజీ కాందంటున్నారు విశ్లేషకులు.. ఈ ఎన్నికల్లో జననాయక్‌ జనతా పార్టీ, ఆజాద్‌ సమాజ్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దల్, బహుజన్‌ సమాజ్‌పార్టీ, హర్యానా లోఖిత్‌ పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ మాత్రం ఒంటరిగా బరిలో…

Read More
19 Sep 2024, 1:45 pmsiranews.in