Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 18 June 2024, 3:40 pmEditor : SIRA NEWS
Agri Employees Society:వర్షాలు కురవాలని అగ్రి ఎంప్లాయిస్ సొసైటీ సభ్యుల పూజలు

సిరాన్యూస్, బేల
వర్షాలు కురవాలని ఆగ్రో ఎంప్లాయిస్ సొసైటీ సభ్యుల పూజలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలని కోరుతూ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా
బేల మండలంలోని ఆగ్రో ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో కప్పతల్లికి గంగబిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అనిల్ గూండావార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవాలని, అన్నదాతలు సంతోషంగా ఉండాలని పూజలు చేపట్టామని తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆగ్రో ఎంప్లాయిస్ సీడ్స్, ఫెస్టిసైడ్స్ షాప్ యజమానులు , ప్రణయ్ తాతవార్, మాజీ సర్పంచ్ దేవన్న , నిలేష్ గుండావార్, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, దినేష్ బోయేర్ తది తరులు పాల్గొన్నారు.

