
రోజుకో మలుపు తిరుగుతున్న అగ్రిగోల్డ్ వ్యవహరం
సిరా న్యూస్,విజయవాడ; అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో జోగి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. రేపో మాపో జోగి రమేష్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది సీఐడీ.జోగి రమేష్‌కి తాను స్థలం అమ్మలేదని సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు సంబంధిత వ్యక్తి పోలవరపు మురళీమోహన్. డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు తనవి కావని అంటున్నారాయన. వాస్తవానికి సర్వేనెంబరు 88లో 4 ఎకరాలు వెంటకచలమారెడ్డి పేరుపై ఉంది. అందులో ఓ ఎకరం పోలవరపు మురళీమోహన్, మరొకటి అద్దెపల్లి కిరణ్ కుమార్‌కు.. రెండు ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారుపోలవరపు మురళీమోహన్ తన ఎకరం స్థలాన్ని ప్లాటులుగా విభజించి 2003,…
