
ఏఐ వర్సెస్ ఏలియన్స్
సిరా న్యూస్,హైదరాబాద్; శాస్త్ర సాంకేతిక రంగాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే కొత్త కొత్త పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగాన్ని ఒక ఊపు ఊపుతోంది. దీనివల్ల అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను మార్పులకు కారణమవుతోందనుకుంటే.. ఇప్పుడు సరికొత్తగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తెరపైకి వచ్చింది. అయితే ఇది మనిషి రూపొందించింది అయినప్పటికీ.. అంతకు మించిన తెలివితేటలతో పనిచేస్తుందట. మనిషి అర్థం చేసుకునే దానికంటే రెట్టింపు వేగంతో కార్యకలాపాలు సాగిస్తుందట. అభివృద్ధి, నాగరికత పెరుగుదలలో కీలకమైన దశతో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ సమానంగా ఉంటుందట. ఇది ఇతర గ్రహాలపై మనగడ సాధ్యమా? కాదా? అనే అంశాలను కూడా కనుక్కుంటుందట. అయితే గ్రహాంతర నాగరికతల రహస్యాలను, వాటి వెనుక ఉన్న చిక్కుముళ్లను ఈ సాంకేతిక…
