Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 30 March 2024, 6:04 pmEditor : SIRA NEWS

Ailaiah Yadav: శ్రీధర్ బాబు నియామకంపై హర్షం: గుండేటి ఐలయ్య యాదవ్ 

సిరాన్యూస్‌, ఓదెల
శ్రీధర్ బాబు నియామకంపై హర్షం: గుండేటి ఐలయ్య యాదవ్ 
* కాంగ్రెస్ నాయ‌కుల సంబ‌రాలు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మ‌న్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. శనివారం కొలనూర్ రైల్వే గేట్ వద్ద కాంగ్రెస్ నాయ‌కులు గుండేటి ఐలయ్య యాదవ్ సీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న లోకసభ ఎన్నికల్లో శ్రీధర్ బాబు నాయకత్వంలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, ఐదు న్యాయాలతో సంక్షేమ పథకాలు అందించబోతుందని అన్నారు. శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు , వివేక్ వెంకట స్వామి , మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , వినోద్ , ప్రేమ్ సాగర్ రెడ్డిల‌ నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగర వేసి గడ్డం వంశీ కృష్ణ ను గెలిపిస్తామని అన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల సదశివ్ , గాజుల శివ శంకర్, గుండెటి శంకర్, తుంగని అశోక్, అసరి వెంకటేష్, పేరం కొమురయ్య, లక్కం సారయ్య, అసరి మహేందర్, గుండెటి మల్లేష్, కర్ర లక్సమారెడ్డి, గోపు కోమల్ రెడ్డి, గాజుల సదయ్య, గంట శ్రీనివాస్ గుండెటి కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.