Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 7 February 2024, 6:32 pmEditor : SIRA NEWS

Alishetty Krishna Kumar: రామాలయం కోసం రూ. 80 వేల విరాళం అందించిన అలిశెట్టి కృష్ణ కుమార్…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

రామాలయం కోసం రూ. 80 వేల విరాళం అందించిన అలిశెట్టి కృష్ణ కుమార్…

+ ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అలిశెట్టి నారాయణ కుమారుడు అలిశెట్టి కృష్ణ కుమార్, గ్రామంలో నిర్మిస్తున్న రామాలయం కోసం రూ. 80 వేల విరాళం అందించారు. గ్రామంలో రామాలయం నిర్మిస్తున్నట్లు తెలియడంతో ధ్వజస్తంభం కోసం తనవంతుగా నగదు అందించినట్లు ఆయన తెలిపారు. రామాలయం కోసం నిధులు సేకరిస్తున్నట్లు గ్రామస్తుల ద్వార తెలుసుకున్న ఆయన, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు గ్రామస్తులను హైదరాబాద్ లోని తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. కాగా ఆలయం కోసం రూ. 80 వేల విరాళం అందించి ఉదారత చాటుకున్న కృష్ణ కుమార్ ను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో నాయకులు అడప తిరుపతి, కల్చాప్ రెడ్డి, గాజంగుల స్వామి, అలిశెట్టి ప్రమోద్ కుమార్, పరాతే వసంతరావ్, భగత్ గౌతమ్, తదితరులు ఉన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.