
అలిశెట్టి సాహిత్యం సమాజ హితం
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాలలో జయంతి, వర్థంతి వేడుకలలో పలువురు నివాళులు సిరా న్యూస్,జగిత్యాల; తెలంగాణ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ అని, ఆయన రచనలు భవిష్యత్తు తరాలకు అక్షర కరదీపికలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణ అంగడి బజార్ లో అలిశెట్టి విగ్రహం వద్దఅలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి నేటి నిర్వహించగా, ఈ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత- సురేష్ ,తోపాటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బీజేపీరాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి లు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు..ఆనంతరం జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజం కోసం తండ్లాడిన అలిశెట్టి జయంతి, వర్ధంతి ఒకటేరోజు కావడం యాదృచ్చికమే అయినా, మరణం నా చివరి చరణం…
