https://siranews.in/
All India Ambedkar Youth Association Kishtaiya: ఈ నెల 29 ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శంకరపట్నం మండలం ఎన్నికలు

సిరాన్యూస్, శంకరపట్నం:
ఈ నెల 29 ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శంకరపట్నం మండలం ఎన్నికలు
* మానకొండూరు నియోజకవర్గం సంఘం ఇంచార్జ్ దేవునూరి కిష్టయ్య
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ జిల్లా సంఘాల ఆదేశాల మేరకు శంకరపట్నం మండల నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు మానకొండూరు నియోజకవర్గం సంఘం ఇంచార్జ్ దేవునూరి కిష్టయ్య తెలిపారు. శనివారం శంకరపట్నం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంకరపట్నం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ నెల 29 ఆదివారం జరిగే కార్యక్రమానికి మండలం లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అంబేద్కర్ వాదులు, అధిక సంఖ్యలో హాజరై కమిటీ ఎన్నికను విజయవంతం చేయాలని మండల ప్రజలను కోరారు. ఈ నియామకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అర్హులుగా తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొట్టె అర్జున్, ప్రధాన కార్యదర్శి, దేవునూరి కుమారస్వామి, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు గరిగె ప్రభాకర్, బండారి తిరుపతి, సంఘం సభ్యులు నాంపల్లి తిరుపతి, ఎల్కపెల్లి సుధీర్, గొర్ల కొమురయ్య, ఆడితం కుమారస్వామి, వదల దేవరాజ్, రాజు, దేవునూరి రాకేష్, కన్నం సోను, అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు.
