
విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయాలి.
కలెక్టర్ రాహుల్ శర్మ. సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి; అన్ని పాఠశాలల విద్యార్థులకు, వసతి గృహల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో వైద్య, పంచాయతి రాజ్, మున్సిపల్, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు.పరీక్షలు నిర్వహణలో వ్యాధులు ప్రబలిన విద్యార్థులు వివరాల నివేదికలు అందచేయాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు పెంచాలని సూచించారు. వ్యాధులు ప్రబలే కాలమని వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. అన్ని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను తనిఖీ చేయాలని, వైద్య పరీక్షల ధరల పట్టిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సర్క్యూలర్ జారీ చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ వైద్య సేవలు…
