
పొత్తులు… కత్తులు…
సిరా న్యూస్,హైదరాబాద్; భారత రాష్ట్ర సమితి పార్టీ బీజేపీలో విలీనం లేదా పొత్తు కోసం చర్చలు పూర్తయ్యాయని కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది. అయినా బీఆర్ఎస్ వైపు నుంచి ఖండన ప్రకటనలు రావడం లేదు. ఢిల్లీలో చర్చలు జరిపారని భావిస్తున్న హరీష్ రావు, కేటీఆర్ సైలెంట్ గా ఉండటంతో ఆ చర్చలు నిజమని అందరూ నమ్ముతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం కోసం హైకమాండ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తా లేకపోతే విలీనమా అన్న అంశాలపై అభిప్రాయసేకరణ జరుపుతున్నారు. ముగ్గురు ఎంపీలు బీఆర్ఎస్తో అసలు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని గట్టిగా పట్టుబడుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో విలీనం చేసుకున్నా..…
