
కూటమిలో సీట్ల జగడం…
సిరా న్యూస్,విజయవాడ, రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వైసీపీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీని కూడా కూటమిలో చేర్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని సవ్యంగా సాగితే మరో రెండు వారాల్లో కూటమిపై స్పష్టత వస్తుంది. బీజేపీని కూటమిలో చేర్చే విషయంపై తుది చర్చలు జరిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఢిల్లీకి వెళతారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదంతా ఒకపక్క జరుగుతుండగా.. మరోపక్క సీట్ల పంపకాలపై కూటమిలో జగడం తప్పేలా లేదన్న ప్రచారమూ సాగుతోంది. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దీన్ని సమర్థించేలా…
