
అల్లు శిరీష్ “బడ్డీ” సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
సిరా న్యూస్; అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో "బడ్డీ" సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయిలు మాత్రమే టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. "బడ్డీ" సినిమాకు మరింత ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు…
