
విశాఖ పార్లమెంట్ కు అంబటి
సిరా న్యూస్,విశాఖపట్టణం; భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో లాంఛనంగా చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కూడా కన్ఫామ్ అయిపోయింది. అయితే, ఆయన గుంటూరులో పర్యటిస్తుండగా అక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, అందరూ అనుకుంటున్నట్లుగా గుంటూరు కాదు.. మరో ముఖ్యమైన స్థానానికి రాయుడు పేరును పార్టీ పరిశీలిస్తోంది. వైసీపీ సోర్సుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన్ను వైజాగ్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కుటుంబం ఎన్నో ఏళ్లుగా హైదారాబాద్‌లోనే స్థిరపడింది. రాయుడు వైఎస్సార్పీసీ నేతలు చర్చలు సాగిస్తున్నప్పుడే ఆయన గుంటూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారని వినిపించింది. పెదకూరపాడు, పొన్నూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అంబటి పోటీ చేసే…
