
An Inspiring Farmer, Asthak Subhash: బొప్పాయి సాగులో లక్షల్లో లాభాం…
సిరా న్యూస్, ఆదిలాబాద్ వ్యవసాయం: బొప్పాయి సాగులో లక్షల్లో లాభాం... + తోటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు అస్తక్ సుభాష్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు లేక అనేక మంది రైతు అప్పులపాలవుతున్నారు. చాలా మంది రైతులు ఏళ్లుగా పంటల సాగులో మూస ధోరణి అవలంభించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రతీ ఏడాది ఒకే రకమైన పంటలు వేయడం కూడ రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయా వంటి పంటల వైపు మొగ్గు చూపడంతో తరుచుగా నష్టాలు చవిచూస్తున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పార్డి గ్రామానికి చెందిన రైతు అస్తక్ సుభాష్ మాత్రం అందరికి భిన్నంగా తోటల పెంపకంతో మంచి లాభాలు ఆర్జిస్తూ అందరికి అదర్శంగా నిలుస్తున్నాడు.…
