తాజా వార్తలు

ఇక బాలక్ రామ్

 సిరా న్యూస్,లక్నో; అయోధ్య వాసుల ఐదు శతాబ్దాల కల, కోట్లాది మంది రామ భక్తుల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. అయోధ్యలో రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో జనవరి 22న బాల రాముడిని ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుక అనంతరం బాల రాముడి దివ్య రూపాన్ని దర్శించుకుని యావత్‌ దేశం పులకించింది. అయితే ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్‌ రామ్‌’గా పిలవనున్నారు. ఈమేరకు ట్రస్టీ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ వెల్లడించారు. మందిరంలో రాముడు పసి బాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందుకే రామచంద్రమూర్తి పేరును బాలక్‌ రామ్‌గా పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇక బాల రాముడి దివ్య దర్శనానికి మంగళవారం నుంచి సామాన్యులను కూడా అనుమతిస్తున్నారు. ఆలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట పూర్తికావడంతో హారతి వేళలు,…

Read More
25 Jan 2024, 4:57 pmsiranews.in