Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 15 December 2023, 8:25 pmEditor : Sira News

రోడ్డెక్కిన ఆశ వర్కర్లు

సిరా న్యూస్,నెల్లూరు;
నిన్న అంగన్వాడీలు.. నేడు ఆశ వర్కర్లు పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిరసన బాట పడుతున్నారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల వ్యవహరిస్తున్న తీర్పు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమకు ఇచ్చే 10000 జీతాన్ని కూడా రెండుసార్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల డెలివరీ కేసులు PHC సబ్ సెంటర్ తిరిగి ఎందుకు తమకు వచ్చే జీతం లో నాలుగు వేలు ఉండే ఐదు వేలు ఖర్చు అవుతుందన్నారు. కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆశా వర్కర్ కుటుంబాలని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలన నుండి పెద్ద ఎత్తున ఆశ వర్కర్ల పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.