Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 21 December 2023, 2:26 pmEditor : Sira News
మేకపాటిని అడ్డుకున్న అంగన్వాడీలు

సిరా న్యూస్,వింజమూరు;
అంగన్వాడి కార్యకర్తల ఆగ్రహ జ్వాలలు వైసిపి నాయకులు బెంబేలెత్తుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ తొమ్మిది రోజులుగా అంగన్వాడి వర్కర్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉదయగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాన్వాయిని అంగన్వాడి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఐసిడిఎస్ కార్యాలయం నుండి బిక్షాటనగా వస్తున్న అంగన్వాడీలకు మేకపాటి కాన్వాయ్ తారసపడింది. నిరసనలో పాల్గొనిన అంగన్వాడీ వర్కర్స్ మేకపాటి కాన్వాయ్ ని అడ్డుకొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మేకపాటి వారికి హామీ ఇచ్చారు.
