
అనిల్ కు ప్రాధాన్యం
సొంత సామాజికవర్గం దూరం... సిరా న్యూస్,నెల్లూరు; వైసీపీలో కులాల కుంపట్లు బయటపడ్డాయా? ఓటమికి కారణం మీరంటే మీరు అని నేతలు కయ్యానికి దిగుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసిపి పతనానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారణమని రెడ్డి సామాజిక వర్గం ఆరోపణలు చేయడం విశేషం. అనిల్ తీరుతోనే ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గం నేతలంతా టిడిపిలో చేరిపోయారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఓటమితో స్వయంగా వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం అనిల్ తీరుపై రుస రుసలాడుతోంది. ఆయనకు ఇప్పటికీ జగన్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుపడుతోంది రెడ్డి సామాజిక వర్గం. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించిన క్రమంలో.. వైసీపీ శ్రేణుల మధ్య చిన్నపాటి వాదన రేగినట్లు సమాచారం.వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న జిల్లాల్లో…
