Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 24 June 2024, 11:00 amEditor : SIRA NEWS

Anil Jadhav: ప్రయోగశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్‌

సిరాన్యూస్‌, ఇచ్చోడ
ప్రయోగశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్‌

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రూ. 13.50 లక్షలతో సైన్స్ ప్రయోగశాల నిర్మాణానికి బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ భూమిపూజ చేశారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. అనంతరం సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ కి విద్యార్థులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతం రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు పాండురంగ్, సర్పంచ్ సురేందర్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, సాబీర్, రమేష్, గాడ్గే సుభాష్, నర్సింహారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, దిలీప్ యాదవ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.