ఆంధ్రప్రదేశ్

జగన్ పై అనిత ఫైర్

సిరా న్యూస్,విశాఖపట్టణం,; మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెలరేగిపోయారు. డిక్లరేషన్ లేకుండా తిరుమల ఎలా వెళ్తావు అంటూ నిలదీశారు. తిరుమల లడ్డూ ఎన్నడూ తినని జగన్‌ దాని నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఎస్ నేను హిందువును. నేను ధైర్యంగా చెప్తున్నా. నాలాగా నువ్వు చెప్పగలవా అంటూ ఛాలెంజ్ చేశారు. ఒక దళితురాలినైన నన్నే నువ్వు ఒకనాడు తిరుమల వెళ్లనివ్వలేదని ఆమె గుర్తు చేస్తుకున్నారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా వెంకటేశ్వరస్వామికి నన్ను దూరం చేయగలిగావా అంటూ అనిత విరుచుకుపడ్డారు.…డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా జగన్ అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నారని, అలాంటి నీకు దీనిపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఇక జగన్ దళితులను ఈ వివాదంలోకి లాగడంపైనా అనిత మండిపడ్డారు. దళితులు అంటే అంత చిన్నచూపు ఏంటని, దళితులు…

Read More
28 Sep 2024, 5:57 pm
Updated: 28 Sep 2024, 5:57 pm
siranews.in