Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 20 January 2024, 8:15 pmEditor : SIRA NEWS

Anji Kumar: అంజి కుమార్ ను సన్మానించిన బిజెపి శ్రేణులు…

సిరా న్యూస్, ఖానాపూర్:

అంజి కుమార్ ను సన్మానించిన బిజెపి శ్రేణులు…

బీజేపీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన అంజు కుమార్ ను బిజెపి శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శనివారం పూల బొకేలు, శాలువాలతో ఆయన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అంజి కుమార్ మాట్లాడుతూ… పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని అన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ బీజీపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, ఖానాపూర్ మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయకులు నల్లా రవీందర్ రెడ్డి, జక్కుల సత్తయ్య, అమరవేని రవీందర్ గౌడ్, మందపెళ్లి రమేష్, ముల్కీ కృష్ణ, తగల పెళ్లి జీవన్, నాగరాజు, అడపా రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.