
అన్నా రాంబాబు వెనుక వైవి
సిరా న్యూస్,ఒంగోలు; ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పార్టీలో అంతర్గత కలహాలు హై కమాండ్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి రూపంలో నిత్య అసంతృప్తి కనిపిస్తోంది. అటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం కంఫర్ట్ గా కనిపించడం లేదు. ఆ ఇద్దరి నేతల వ్యవహార శైలితో హై కమాండ్ విసిగి వేసారి పోతోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ అంటేనే మండి పడిపోతున్నారు. జగన్ సైతం బాలినేని వదులుకునేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. ఎంపీ మాగుంట మరోసారి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలంటే భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివాదం అలా ఉండగానే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని…
