
పాల్ ను వెంటాడుతున్న మరో కేసు
సిరా న్యూస్,విజయవాడ; వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకూ చిక్కులు తప్పడం లేదు. తాజాగా సీఐడీలో పని చేసి రిటైరైన విజయ్పాల్కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. రఘురామ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినప్పటి నుంచి విజయ్ పాల్ అందుబాటులో లేరు. పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా విజయ్ పాల్ గురించిన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి పోలీసుల తరపు న్యాయవాది తీసుకెళ్లారు. పలుమార్లు విచారణ తర్వాత ముందస్తు బెయిల్ తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం విజయ్ పాల్ ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియడం లేదు. ముందస్తు బెయిల్ కూడా హైకోర్టు నిరాకరించినందున ాయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయన గత ప్రభుత్వ హయాంలోనే రిటైర్…
