తాజా వార్తలు

ఏపీలో మరో కొత్త పార్టీ

సిరా న్యూస్,గుంటూరు; ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అధిక జన మహా సంకల్ప సభ సాక్షిగా పార్టీ పేరును ప్రకటించారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఇప్పటికే మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ (ఎన్) పార్టీని స్థాపించి ముందుక సాగుతున్నారు. ఈ తరుణంలో మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి కొత్త పార్టీ స్థాపించి.. గత కొంత కాలంగా ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఫిబ్రవరి 14న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణం నుంచి 15 అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీనికంటే ముందు “లిబరేషన్ కాంగ్రేస్” అంటూ తన పార్టీ పేరును ప్రకటించారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఈ సభలో మాట్లాడుతూ ముందుగా తనకు జన్మనిచ్చిన్న తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఆ తరువాత ఐక్యత విజయపదం…

Read More
15 Feb 2024, 5:51 pmsiranews.in