
ఏపీ బీజేపీ..అంతా కన్ఫ్యూజన్
సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా..? లేకుంటే టీడీపీ-జనసేన కూటమితో పొత్తులతోనే ముందుకు వెళ్లాలా..? అనే దానిపై హైకమాండ్ తేల్చడం లేదు. ఇందుకోసమే ఏపీ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటు పార్లమెంట్.. ఇటు అసెంబ్లీలో ఏపీ నుంచి నేతలు తప్పకుండా అడుగుపెట్టాల్సిందేనని హైకమాండ్ గట్టిగానే వ్యూహ రచన చేస్తోంది. బోణీ కొట్టాలన్నదే ప్రస్తుతం ఏపీ కమలనాథుల టార్గెట్ అంటున్నారు. ఇటీవల రాష్ట్ర నేతలతో హైకమాండ్ ప్రతినిధితో జరిగిన చర్చల్లో బీజేపీ పొత్తు అంశం హాట్ టాపిక్‌గా నిలిచింది. పొత్తుపై పార్టీ కీలక నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను సేకరిస్తున్నట్లు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వెల్లడించారు. దాంతో పాటుగా రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒంటరి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది?…
