
ఏపీ కాపులు ఎటూ వైపు
సిరా న్యూస్,కాకినాడ; ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న కొలది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కాపు ఓట్లను తమ వైపు తిప్పుకుంటే గెలుపు ఖాయమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు ఫ్యాక్టర్ బలంగా వినిపిస్తోంది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ వైపు కాపులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బరిలో నిలిచినా.. రకరకాల కారణాలతో కాపులు జగన్ వైపు ఆసక్తి చూపారు. వారిని తన వైపు తిప్పుకోవడంలో జగన్ కూడా సక్సెస్ అయ్యారు. ఇందుకు ముద్రగడ కూడా పరోక్షంగా కారణమయ్యారు. చంద్రబాబు పై ఉన్న కోపంతో ముద్రగడ కాపులను తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన వైపు వారిని మరల్చలేదు. జగన్ వైపు…
