
ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలు
సిరా న్యూస్,విజయవాడ; ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎపుడు అన్న పెద్ద డౌట్ ఉంది. ముందస్తు వెనకస్తు అంటూ చాలా ప్రచారం జరిగింది. విపక్షాలు రేపో మాపో ఎన్నికలు అంటూంటే అధికార వైసీపీ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంటూ వచ్చింది. ఇపుడు వైసీపీ మాటే నిజం కాబోతోంది. సార్వత్రిక ఎన్నికల తోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది. ఈసారి ఏడెనిమిది దశలలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.మరి ఈసారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఎన్నో ఊహగానాలు వెలువడుతున్నాయి. సౌత్ నుంచి తొలిదశ మొదలెడతారా లేక నార్త్ నుంచి వస్తూ మధ్య దశలలో ఏపీ ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా…
