
ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్
సిరా న్యూస్,కరీంనగర్; మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ పరికరాల హవా కొనసాగుతోంది. ఆరోగ్య సమస్యలను అలర్ట్ చేసేందుకు స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. స్మార్ట్ వాచీలు, స్మార్ట్ రింగ్ లు , స్మార్ట్ బ్యాండ్ లు ఇలా పేరు ఏదైనా సరే ఫిట్నెస్, హెల్త్ ఇష్యూస్ పై అలర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లలో ఫీచర్లు శరీర కదలికలను బట్టి ఫిట్నెస్ లెవల్స్, హార్ట్ బీట్, పల్స్ చెప్పేస్తున్నాయి. దీంతో ఇటీవల స్మార్ట్ వాచ్ ల వినియోగం పెరిగింది. వీటిల్లో ముఖ్యంగా యాపిల్ స్మార్ట్ వాచ్ లకైతే ప్రత్యేక డిమాండ్ ఉంది. వీటిల్లో రీడింగ్స్ కచ్చితత్వం ఉంటాయని ప్రజల్లో నమ్మకం. యాపిల్ వాచ్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సరైన సమయంలో హెచ్చరికలు జారీచేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాపిల్ వాచ్ బీజేపీ నేత…
