
విశాఖలో గేట్లు బార్లా తెరిచాశారా…
సిరా న్యూస్,విశాఖపట్టణం; ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడిప్పుడే వైసిపి కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే పార్టీ శ్రేణులు గాడిలో పడుతున్నాయి. అయితే ఓటమి మాత్రం నేతల్లో నైరాశ్యం పెంచింది. కోలుకొని పూర్వవైభవం సాధిస్తుందని ఎక్కువమంది భావించడం లేదు. అధినేత జగన్ వైఖరి భిన్నంగా ఉండడమే అందుకు కారణం. పైగా జాతీయస్థాయి రాజకీయాలు ఏపీపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే పార్టీలో ఉండడం కంటే.. వేరే పార్టీలో చేరడం ఉత్తమమని చాలామంది ఒక నిర్ణయానికి వస్తున్నారు. అధికార పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ పార్టీలో చేరిపోతున్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు విజయం సాధించింది వైసిపి. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయ్యింది. క్యాడర్ కు ఊహించని పరాజయం ఎదురు కావడంతో ఒక రకమైన ఆందోళన…
