
వైసీపీ నుంచి చేరికలు లేవా…
సిరా న్యూస్,విజయవాడ; ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అధికారంలోకి రావాలని టిడిపి, జనసేన భావిస్తుండగా.. రెండవసారి కూడా అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వాలని అధికార వైసిపి భావిస్తోంది. అయితే అక్కడ టిడిపికి ఓవర్గం మీడియా అండగా ఉంది. అందుకే తిరువూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య భారీ గొడవ జరిగింది. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో చాలామంది గాయపడ్డారు. అందులో ఒక పోలీస్ కూడా ఉన్నారు. యాదృచ్ఛికంగా ఈ వార్త టీడీపీ అనుకూ మీడియాలో పెద్దగా ప్రసారం కాలేదు. ప్రచురణకు కూడా నోచుకోలేదు. ఒకవేళ ఇదే ఘటన వైసీపీలో జరిగి ఉంటే ఆ మీడియా ఎలా చేసి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాదు ఆ వర్గం మీడియా ఎంత తాపత్రయపడినప్పటికీ జరగాల్సింది…
