
కౌంటింగ్ కేంద్రాలలో పకడ్బందీ భద్రతా చర్యలు
సిరా న్యూస్,సంగారెడ్డి; ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు ఆదేశించారు. పటాన్ చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచిన జహీరాబాద్ ఎంపీ పరిధిలోని ఈవీఎంలకు చెందిన సెక్యూరిటీ లాక్ బుక్ రిజిస్టర్స్ లను, మూడు అంచెల సెక్యూరిటీ ఏర్పాటు ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఐడి కార్డు లేకుండా ఎవరిని అనుమతించవద్దని CRPF సెక్యూరిటీ అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూంలతో పాటు వాటి పరిసరాలను…
