
రాజధాని మార్పు లేనట్టే..
సిరా న్యూస్,విశాఖపట్టణం; ఏపీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహాల్లో రాజధాని ఇష్యూ అత్యంత కీలకం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అని .. వికేంద్రీకరణ అని రాజకీయం ప్రారంభించారు. నాలుగున్నరేళ్లు గడిచే సరికి ఆయన ఏ ఒక్క ప్రాంతానికీ వెళ్లలేకపోయారు. ఉన్న చోట నుంచి కదల్లేకపోయారు. విశాఖకు వెళ్లేందుకు ఎన్నో సార్లు ముహుర్తం ఖరారు చేసుకున్నా చివరికి ఆటంకాలు తప్పడం లేదు. డిసెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని చాలా సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు కూడా కనిపించం లేదు. ఓ వైపు రాజధాని పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటే.. మరో వైపు ఆఫీసుల తరలింపుపై హైకోర్టులో కేసులు పడ్డాయి. అంతకు మించి క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మించిన రుషికొండ ఇల్లు కూడా కోర్టు…
