తెలంగాణ

Asthak Ujwala Subhash: సర్పంచ్‌ అస్తక్‌ ఉజ్వల సుభాష్‌కు ఘన సన్మానం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: సర్పంచ్‌ అస్తక్‌ ఉజ్వల సుభాష్‌కు ఘన సన్మానం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని పార్డి–కే సర్పంచ్‌ అస్తక్‌ ఉజ్వల సుభాష్‌ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సర్పంచుల పదవి కాలం ముగియడంతో ఈ మేరకు సర్పంచ్‌తో పాటు, ఉప సర్పంచ్, ఇతర వార్డు సభ్యులకు గ్రామస్తులు శాలువాలతో సత్కరించారు. గ్రామాభివృధికి 5సంవత్సరాల పాటు విశేష కృషీ చేసినందుకుగాను శుక్రవారం ఈ మేరకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అస్తక్‌ ఉజ్వల మాట్లాడుతూ... 5 సంవత్సరాల పాటు తనకు చేదోడువాదోడుగా నిలిచిన వార్డు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్దికి తనతో కలిసి నడిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు గ్రామాస్తులు మాట్లాడుతూ... సర్పంచ్ అస్తక్ ఉజ్వల సేవలను కొనియాడారు.

Read More
2 Feb 2024, 11:42 pm
Updated: 2 Feb 2024, 11:49 pm
siranews.in