
ఎన్నికల వేళ… వరుస సమ్మెలు
తలకు మించిన భారంగా హామీలు సిరా న్యూస్, రాజమండ్రి; ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్, అవుట్సోర్స్ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీళ్లంతా రోడ్డు ఎక్కుతున్నారు. ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న టైంలో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీని కలవర పెడుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరుగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలు తమ డిమాండ్ పూర్తిగా నెరవేర్చే వరకు తగ్గేదేలే అంటున్నారు. వీళ్లకు ఇప్పుడు మిగతా శాఖల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా జత కలవబోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో జగన్ మోహన్ రెడ్డి…
