ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో దారుణాలు..

 సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో దారుణం జరిగింది. ఓ గుర్తు తెలియని మహిళను దుండగులు హతమార్చి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ కోర్టు సమీపంలోని ఇళ్ల మధ్య గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కాలనీవాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న గుర్తు తెలియని మహిళను కొందరు దుండగులు ఎక్కడో హత్య చేసి పట్టణంలోని శ్రీనివాస కాలనీలోని ఇళ్ల మధ్య పడేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహాన్ని చుట్టి ఉంచారని చెప్పారు. మృతురాలికి పసుపు రంగు దుస్తులున్నాయని.. ఆమె 2 చెవులు కత్తిరించి చెవి కమ్మలు తీసేసిన ఆనవాళ్లు ఉన్నట్లు…

Read More
28 Sep 2024, 5:59 pmsiranews.in