Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 14 February 2024, 1:57 pmEditor : SIRA NEWS

Aude Gajender: అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది

సీరా న్యూస్ బోథ్‌
అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది
*బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్
అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతామ‌ని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బుధ‌వారం సోనాల గ్రామంలోని శివాజీ నగర్ కాలనీ, దేవుళ్ళ నాయక్ తాండలో డ్రైనేజ్, సీసీ రోడ్లకు ప‌నులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పట్టణం నుంచి పల్లెటూరి వరకు, అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అనంతరం వారికి గ్రామ ప్రజలు, కార్యకర్తలు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సోనాల పట్టణ అధ్యక్షులు, చెట్లపెల్లి అనిల్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రమేష్ బత్తుల, సినియర్ నాయకులు గాజుల పోతన్న, విజయ్ భాస్కర్ రెడ్డి, వర్కింగ్ పెసిడెంట్ మహ్మద్ బాయ్ సంపత్ నాయక్ తాండ మాజీ సర్పంచ్ సాకారం, ఎంపీటీసీ రోహిదాస్, బలిరామ్,సాధశివ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.