తాజా వార్తలు

అయోధ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

కోనసీమ కొబ్బరి బొండాలు స్పెషల్  సిరా న్యూస్,అయోధ్య; అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దేశమంతా రామనామం మోగుతుంది. తమ ప్రాంతాల ప్రసిద్ధి చెందిన వాటిని రామయ్యకు కానుకగా ఇచ్చేందుకు అనేక మంది పడుతున్నారు. అందులో భాగంగా కోనసీమ నుంచి కొబ్బరిబోండాలను ప్రత్యేకంగా ఇక్కడి నుంచి అయోధ్యకు పంపుతున్నారు. రాములోరి కల్యాణానికి ఉపయోగించే విధంగా కల్యాణ బోండాలను కోనసీమ ప్రాంతం నుంచి నేడు బయలుదేరి అయోధ్యకు వెళ్లనున్నాయి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోనసీమలోని మండపేట నుంచి ఈ కొబ్బరిబోండాలను చూడవచ్చు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం రోజు వినియోగించేందుకు ప్రత్యేకంగా వీటిని తయారు చేశారు. కోనసీమ కొబ్బరిబోండాలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడి నుంచి అయోధ్యలోని సీతమ్మ ఆశ్రమం అభ్యర్థన మేరకు శంకు, చక్ర, నామాలతో రూపొందించిన కొబ్బరి బోండాలను రామ మందిర ప్రారంభోత్సవానికి…

Read More
17 Jan 2024, 7:29 pmsiranews.in