
బీ ఫార్మసీ విద్యార్ధిని అత్మహత్యాయత్నం
సిరా న్యూస్,కరీంనగర్; కరీంనగర్ జిల్లాలో బీ ఫార్మసి విద్యార్ధిని శివప్రియ ఆత్మహత్యకు యత్నించింది. హాస్టల్ భవనం పై నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామపంచాయితీ పరిధిలోని సుభాష్ నగర్ లో వాగేశ్వరి కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్న శివప్రియ అక్కడ ప్రైవేట్ హాస్టల్ లక్ష్మిత లో ఉంటున్నారు. ఉదయం హాస్టల్ భవనం మూడంతస్తులపై నుంచి శివప్రియ దూకి ఆత్మహత్యకు యత్నించింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే కారులో ఆసుపత్రికి తరలించారు. శివప్రియ స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గా గుర్తించారు. శివప్రియకు తలకు తీవ్రగాయంకాగ బ్లడ్ క్లాట్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఓ కాలు సైతం ప్యాక్షర్ అయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు. హస్టల్ భవనం పై నుంచి…
